నాణ్యమైన విద్యకోసం పేరుగాంచిన ఐఐటీల్లో బీఈడీ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) కు రూపకల్పన చేస్తున్నట్టు వివరించారు. ఇది నాలుగేళ్ల కాల వ్యవధి కలిగి ఉంటుందని తెలిపారు. భావితరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఐఐటీలు ఉత్తమ విద్యాకేంద్రాలని ధరేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. దేశంలో అనేక బీఈడీ కాలేజీలు ఆశించిన ఫలితాలు అందించలేకపోతున్నాయని, వాటి పనితీరు నాసిరకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో, నాణ్యమైన విద్యకు పేరుగాంచిన ఐఐటీల్లో బీఈడీ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు.