మొన్నటి వరకు అల్లర్లతో అట్టుడికిన కోనసీమ ప్రాంతంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించారు. కోనసీమ జిల్లా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భగ్గుమన్న ఓ వర్గం అమలాపురంలో అల్లర్లకు దిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పట్టణంలోని మంత్రి పినిపే విశ్వరూప్, వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలతో అల్లర్లు జరిగిన నాటి నుంచి అమలాపురంలో పోలీసు ఆంక్షలు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పుడిప్పుడే అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. దీంతో పట్టణంలోని తాజా పరిస్థితులను పరిశీలించేందుకు డీజీపీ అమలాపురం వెళ్లారు. ఈ క్రమంలో ఆందోళనకారుల చేతిలో కాలి బూడిదైన ఇళ్లను డీజీపీ పరిశీలించారు. పట్టణంలో అల్లర్లు చెలరేగిన ప్రాంతాలను కూడా పరిశీలించారు. పట్టణంలో తాజా పరిస్థితులపై పోలీసు అధికారులతో సమీక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa