అల్లంతో అనేక ఉపయోగాలున్నాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక కప్పు అల్లం టీని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.
అల్లం టీని రోజూ తేనెతో కలిపి తీసుకుంటే ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టవచ్చు.
అల్లం టీ వల్ల రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి. హృదయ కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదపడతాయి. నెలసరి సమస్యలూ అదుపులోకి వస్తాయి.
అల్లం టీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికశాతం అందుతాయి. రోగనిరోధక శక్తి పెరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే అరోమా గుణాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి.
అల్లం టీ ఉదయాన్నే తాగితే రోజంతా హుషారుగా ఉంచుతుంది. అల్లం టీని సేవించడం ద్వారా గర్భిణీలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ బాగా పనిచేస్తుంది. సాధారణ టీలో అల్లం బిస్కెట్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
అల్లం టీ తీసుకోవడం వల్ల ఛాతీలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు. మోకాళ్ల వాపులు కూడా అల్లం టీ రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి.
జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధ పడేవారు అల్లం టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.