జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 19 వ తేదీన పర్చూరు రానున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. విజయకుమార్ మీడియాకు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆయన పరామర్శించి పార్టీ తరపున లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారని ఆయన చెప్పారు. ఈ సందర్బంగా పర్చూరు లో భారీ ఎత్తున బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నట్లు విజయ్ కుమార్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa