ఎక్కువ కాలం సహజీవనం చేసిన జంట మధ్య బంధాన్ని అక్రమ సంబంధంగా చట్టం భావించదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక మహిళ, పురుషుడు ఎక్కువ కాలం పాటు సహజీవనం చేస్తే వారి మధ్య బంధాన్ని వివాహంగానే చట్టం పరిగణిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారికి పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని చెప్పింది. ఇలాంటి ఓ కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.