వాతావరణ శాఖ అధికారులు ముందుగా హెచ్చరించిన విధంగా నెల్లూరు నగరంలో బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో చిన్నపాటి చినుకులతో ప్రారంభమై తుంపర్ల వర్షం పడింది. ఒక్కసారిగా ఆకాశం మేఘామృతమైంది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఆహ్లాద కరంగా మారింది. వేసవి ఎండలతో విపరీతమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలు ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతుండడంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.