తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డు రైల్వే గేటు వద్ద గుంతకల్ నుండి కడప వైపు వెళ్ళతున్న డీజిల్ గూడ్స్ రైలు బండి ఇంజిన్ లో డీజిల్ లీకేజీ వల్ల మంటలు వచ్చాయి. లోకో పైలెట్ గూడ్స్ రైలు ను రైల్వే పట్టాలు పై ఆఫీ. ఈ విషయం గుంతకల్ లో ఉన్న ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో మరోక రైల్ ఇంజన్ తెచ్చి గూడ్స్ రైల్ ను పంపించారు. గూడ్స్ రైలు ఇంజన్ లో చెలరేగిన మంటల వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు లేదు. గూడ్స్ రైలు ఆగిపోవడంతో రెండు గంటల పాటు పుట్లూరు రోడ్ రైల్వే గేట్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి.