రాష్ట్రపతి ఎన్నికల్లో బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ(77)ని ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. 2017లో భారత ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ పోటీ చేసి, వెంకయ్య నాయుడు చేతిలో ఓడిపోయారు. మహాత్మ గాంధీ, సి.రాజగోపాలచారి మనవడైన ఆయనను పోటీలో దింపాలని పలువురు ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.