ఇండియాలో తొలి ప్రైవేటు ట్రైన్ ప్రారంభమైంది. భారత్ గౌరవ్ పేరుతో ఈ రైలును కేంద్రం ప్రారంభించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్ వరకు ఈ రైలు ప్రయాణించనుంది. ఈ ప్రైవేటు రైలును రైల్వే శాఖ 2 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది. 20 బోగీలతో ఉండే ఈ రైలులో 1500 మంది వరకూ ప్రయాణికులు ప్రయాణిస్తారు.