రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు ఢిల్లీలో భేటీకి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ సమావేశాన్ని తలపెట్టారు. ఈ భేటీకి మమత 8 మంది సీఎంలకు ఆహ్వానం పంపారు. అయితే వారిలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. కొందరు రావట్లేదని చెప్పగా, మరికొందరు ప్రతినిధులను పంపారు.