రోజూ ఉత్సాహంగా ఉండాలంటే ఉదయంపూట టిఫిన్ చేయడం మానకండి. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. రాత్రి భోజనం చేశాక దాదాపు 8 నుంచీ 10 గంటల వరకూ ఏమీ తినరు. అందుకే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. బ్రేక్ ఫాస్ట్ చేయక పోవడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. తలనొప్పి, టెన్షన్, వణుకు, నీరసం వంటి దరిచేరుతాయి. అందుకే ఉదయం వేళ రాజులా తినాలని, మధ్యాహ్నం మంత్రిలా, రాత్రి బంటులా తినాలని పెద్దలు సామెత చెబుతారు.