పంట నష్టపరిహారం చెల్లించే విషయంలో పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ఈ–క్రాప్ నమోదు చేసిన వెంటనే ఈ–కేవైసీ కూడా చేయిస్తున్నాం. దానికి సరిపడ వివరాలు నమోదు చేసి థంబ్ వేస్తేనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. అయితే ఈ రోజు మొట్ట మొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా రూ.2,977.82 కోట్లు ఒకే విడతలో ఉచిత పంటల బీమా పథకం కింద నష్టపరిహారం అందిచాం అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... నియమ నిబంధనలకు లోబడి ఈ డబ్బులు జమ చేశాం. దీనిపై కొన్ని పత్రికల రాతలు బాధాకరం. విమర్శించే వారి వ్యాఖ్యలు గమనిస్తే..స్థూలంగా రైతు నష్టపోవాలనే ఆలోచనలోఉన్నట్లుగా కనిపిస్తోంది. కనీస పరిజ్ఞానం లేకుండా వార్త కథనాలు రాసినట్లుగా కనిపిస్తోంది. ఆ పత్రికల వారికి ట్రైనింగ్ అవసరమేమో అన్న అనుమానం కలుగుతుంది. ఓ పత్రికలో అరకొర బీమా అని రాశారు. వేరుశనగకు నామమాత్రపు పరిహారం..జిల్లాల వారీగా పరిహారం వివరాలు గోప్యం. ఇందులో గోప్యం ఏముంది? అందరికీ ఈ వివరాలు వెల్లడిస్తున్నాను. ఇదిగో చూడండి. 2,977 కోట్లు ఇస్తున్నప్పుడు ఇందులో గోప్యం ఏముంటుంది?. అందరికీ ఇచ్చాం. అన్ని వివరాలు ఉన్నాయి. మాట్లాడే వారికి, రాసే వాడికి విషయ పరిజ్ఞానం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa