వెంకటేశ్వరుడిపై భక్తితో కాలినడకన తిరుమలకు వచ్చాడు. కానీ అకస్మత్తుగా గుండెపోటు వచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. తిరుమలలో ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. భక్తుడిని బెంగళూర్‌కు చెందిన నవీన్ కుమార్ (39)గా గుర్తించారు. ఆయన కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు. నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్దకు వచ్చారు. అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు కుప్పకూలారు. సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది ఆయణ్ని వెంటనే అశ్వినీ హాస్పిటల్‌కి తరలించారు. అయితే, నవీన్ కుమార్ అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa