ప్రభుత్వం విధించిన మత్స్యవేట నిషేధం ముగియడంతో శుక్రవారం నుంచి మత్స్యకారులు మళ్లీ తమ జీవనయానాన్ని కొనసాగించనున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు ప్రభుత్వం ఏటా చేపల వేట నిషేధిస్తోంది. ఈ కాలం చేపలు ప్రత్యుత్పత్తికి అనువైన దశ కావడంతో ప్రభుత్వం ఆ కాలంలో వేట నిషేధాన్ని అమలుచేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ కాలంలో యానాం నియోజకవర్గ మత్స్యకారులు 4, 964 మందికి పరిహారం అందించినట్లు మత్స్యశాఖ ఏడీ దడాల గొంతియ్య తెలిపారు. ఈ నేపథ్యంలో వేట నిషేధం పూర్తయినప్పటికీ నావలకు, బోట్లకు డీజిల్ లేకపోవడంతో శుక్రవారం నుంచి వేటకు వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa