ఆంధ్రప్రదేశ్ లో బార్ లైసెన్సులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు లైసెన్స్‌ని పొడిగించారు.వాస్తవానికి ఈ నెలాఖరుతో ప్రస్తుత బార్ లైసెన్స్‌ల గడువు ముగియనుంది. జూన్ 27న బార్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. 2022-23 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీని విడుదల చేసింది. కొత్త విధానం సెప్టెంబర్ 1 నుంచి 3 సంవత్సరాల కాలానికి అమల్లోకి వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa