జాబ్ క్యాలెండర్‌లో మిగిలిన 8వేలకు పైగా పోస్టులు సత్వరమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టి పెట్టాలని సూచించారు. జాబ్‌క్యాలెండర్‌పై సీఎం జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..పోలీసు రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. 2021–2022 ఏడాదిలో 39.654 పోస్టులు భర్తీ చేశామని సీఎం చెప్పారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాకే గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఆర్టీసీ ద్వారా 50 వేల మందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. మిగిలిన పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులు ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలన్నారు. నిర్దేశించిన సమయంలోగా మిగతా శాఖల్లోని పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. ఉన్నత విద్యలో పారదర్శకతతో టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పష్టం చేశారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌పై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. వచ్చే నెల మొదటివారంలో నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.