చేతిలో 250 రూపాయలతో గుంటూరుకి చేరుకున్న ఓ తమిళ యువకుడు ,ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేసి దాదాపు 25 ఏళ్లకు పైగా వ్యాపార రంగంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎన్నో ఒడిదుడుకులును ఎదుర్కొని విజేతగా నిలిచాడు. అతనెవరో కాదు xxx సోప్స్- భారతి కన్స్యూమర్ కేర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ అరుణాచలం మాణిక్యవేలు.
అయితే ఈ నెల 18న శనివారం సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరులో శ్రీ ఆలాపన కల్చరల్ అసోసియేషన్-భారతి కన్స్యూమర్ కేర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సత్కారం అలాగే ధర్మప్రభు అవార్డు ప్రధానం జరగనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరం ,గుంటూరులో భారతి కన్స్యూమర్ కేర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,శ్రీ ఆలాపన కల్చరల్ అసోసియేషన్ గుంటూరు వారు దొరకునా ఇటువంటి సేవ - 15 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా
1) విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ గారికి స్వర నీరాజనం.
2)ప్రముఖ సినీహీరో డాక్టర్ శ్రీ సుమన్ తల్వార్ గారికి ఆత్మీయ సత్కారం, ఎన్టీఆర్ అవార్డు ప్రదానోత్సవం.
3) ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ అరుణాచలం మాణిక్యవేలు గారికి ఆత్మీయ సత్కారం, ధర్మప్రభు అవార్డు ప్రధానం జరుగుతాయి.
ఈ కార్యక్రమానికి శ్రీ అరుణాచలం మాణిక్యవేలు గారు జ్యోతి ప్రజ్వలనం చేస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 6.30 గంటలకు సంగీత విభావరి,7.30 గంటలకు సన్మాన కార్యక్రమం,8. 00 గంటలకు సంగీత విభావరి పునః ప్రారంభం అవుతాయి.
ఈ కార్యక్రమం నిర్వహణ
రాఘవేంద్ర హాస్పిటల్స్
శివాలయం ఎదురు రోడ్, గుంటూరు.
కొల్లా వెంకటేశ్వరరావు న్యాయవాది
వ్యవస్థాపక అధ్యక్షులు ఆలాపన
భారతి కన్స్యూమర్ కేర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
గుంటూరు మీడియా పార్టనర్ టీవీ2 న్యూస్