విధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి గూగుల్ డ్రైవ్, వీపీఎన్, డ్రాప్ బాక్స్ వంటివి వాడకూడదు. వీటిపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ రహస్య డేటా సేవ్ చేయడానికి క్లౌడ్ సేవలను, స్కాన్ చేయడానికి థర్డ్-పార్టీ అప్లికేషన్‌లను ఉపయోగించవద్దని ఉద్యోగులకు సూచించింది. అవి వాడకుండా కేంద్రం ఆంక్షలు విధించింది.