ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లెకు చెందిన చిట్రా మురళి, వీణ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీణకు గ్రామ సచివాలయ పోలీస్‌గా జాబ్ వచ్చింది. మురళి కియా కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. వీరిద్దరూ గతేడాది జూన్ 23న ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. రాప్తాడులో కాపురం పెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం మురళి హత్యకు గురయ్యాడు. భర్తను తన తల్లే హత్య చేయించిందని వీణ ఆరోపించింది.