బేతంచేర్ల పట్టణంలో అగ్నిపథ్ కార్యక్రమం నిర్వహించరాదని విద్యార్థి, యువజన, సీపీఐ సంఘాల నాయకులను ముందస్తుగా సీఐ ప్రియతమ్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. దేశ రక్షణ రంగంలో కాంట్రాక్టు పద్ధతిని వ్యతిరేకించి నిరసన తెలపకుండా ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమని సంఘాల నాయకులు భార్గవ్, ఉదయ్, మధుశేఖర్, మండల అధ్యక్షకార్యదర్శులు కిరణ్, షేక్షావలి, ఎల్లకృష్ణ అన్నారు.