సింగరాయకొండ పరిధిలోని జాతీయ రహదారిపై ఇన్నోవా కారు, లారీని ఢీ కొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. విజయవాడ నుండి చిత్తూరు వెళ్తున్న ఇన్నోవా కారు, సింగరాయకొండ వద్దకు రాగానే అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా, మృతి చెందిన మహిళ హర్షినిగా పోలీసులు గుర్తించారు. సింగరాయకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa