దక్షిణాదిలో బలపడే యోచన చేస్తున్న బీజేపీకి గెలిచినా, ఓడినా లాభమేనన్న కోణంలో ధీమాతో ముందుకెళ్తోంది. ఈ ధీమాతోనే వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇక ఏపీలో బలపడాలని సమాలోచనలు చేస్తోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనే నమ్మకం భారతీయ జనతాపార్టీ పెద్దలకు ఏ కోశానా లేదు. ఇక్కడున్న నేతలపై వారికి అంత నమ్మకం ఉంది. వారికి కావల్సింది లోక్‌సభ స్థానాలు. తెలుగుదేశం గెలిచినా, జనసేన గెలిచినా, వైసీపీ గెలిచినా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా 25 సీట్లు బీజేపీ ఖాతాలోనే పడతాయి.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ బలహీన స్థితిలో ఉందని చెప్పవచ్చు. బీజేపీ హయాంలో అందులోను ముఖ్యంగా నరేంద్రమోడీ, అమిత్ షా హయాంలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనపడటంలేదు. దక్షిణాదిలో బలపడటానికి ఇదే మంచి తరుణమని బీజేపీ భావిస్తున్నప్పటికీ ఆ పార్టీకి ఎక్కడా స్పేస్ లేదు. ఏపీలో వైసీపీ, టీడీపీ బలంగా ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ ఎస్‌తోపాటు కాంగ్రెస్ కు కూడా క్షేత్రస్థాయిలో బలం ఉంది. తమిళనాడు, కేరళ సంగతి సరేసరి. కర్ణాటక ఒక్కటే బీజేపీకి ఊరట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa