సైబర్ నేరాల నుండి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రతలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని అనంతపురం జిల్లా సెబ్ అదనపు ఎస్పీ జె.రాంమోహనరావు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాల మేరకు స్థానిక JNTU లో "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" లో భాగంగా " సైబర్ సేఫ్టీ- నేషనల్ సెక్యూరిటీ & సైబర్ నేరాల" పై స్థానిక JNTU లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డి.జి.పి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి IPS ఉత్తర్వుల మేరకు జూన్ 16 వ తేదీ నుంచి 18 తేదీ వరకు అనంతపురం సహా రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఇతర శాఖల సమన్వయంతో పోలీసుశాఖ నిర్వహిస్తున్న "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" లో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.