కర్ణాటక సీఎంలు రామకృష్ణ హెగ్డే, ఎస్ ఆర్ బొమ్మైల మంత్రివర్గాలలో కీలకశాఖలలో పనిచేసిన మాజీ మంత్రి రఘుపతి నాయుడు శనివారం మరణించారు. ఈయన మృతి పట్ల టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తపరిచారు.1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కర్ణాటకలో రక్షణ కల్పించడంలో నాకు, ఎన్టీఆర్ లకు ఆత్మీయుడైన రఘుపతి కీలకపాత్ర వహించారు. అలా ఆనాడు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన రఘుపతి నాయుడుతో స్నేహం తరువాతి కాలంలో కూడ కొనసాగింది. రఘుపతి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తెలియజేసారు