తుఫాన్ వచ్చినా ఆగకుండా కొనసాగితేనే నెల్లూరు సిటీ నియోజకవర్గం మొత్తం ప్రతి ఇల్లు తిరగడానికి ఏడాది పైగా పడుతుంది అంటున్నారు నెల్లూరు జిల్లా జనసేన నాయకులూ కెత్తంరెడ్డి వినోదరెడ్డి . సంవత్సర కాలం ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకొని పవనన్న ప్రజాబాట అని సరికొత్త ఆలోచనతో , ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఆనందంగా స్వీకరిస్తాం అని అంటున్నారు. నా చిన్నపుడు పరిస్థితులు ఎలా ఉండేవంటే... మరిప్పుడు ఎలా ఉన్నాయంటే... అప్పటి పరిస్థితులు మళ్ళీ రావాలని వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఉందమ్మా... పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఆశీర్వదించండమ్మా... ప్రజలందరూ బాగుంటారు అంటూ ఆయన ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. రోజు రోజుకి ప్రజల్లో ఆయనకీ ఆదరణ పెరుగుతుంది అంటే నమ్మక తప్పదు.