మేకపాటి గౌతమ్ రెడ్డి , ఆత్మకూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మంత్రిగా పనిచెసిన సంగతి అందరికి తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు ఆయన కాలం చెయ్యడం యావత్తు రాష్ట్ర ప్రజలని కన్నీటిలో ముంచేసింది. ఆయన చనిపోయిన అనంతరం అక్కడ ఎలక్షన్ జరగనున్న సందర్భంలో బీజేపీ పార్టీ కూడా పోటీలో నిలవడానికి ముందుకు వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులూ సోము వీర్రాజు మాట్లాడుతూ.... ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోనే 2 జాతీయ రహదారులను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేయగా రాష్ట్ర జగన్ పరిధిలో రహదారుల అభివృద్ధి మాత్రం ప్రకటనలకు మాత్రమే పరమితమవ్వడం ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు గమనించాలి, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి అని పిలుపునిచ్చారు.