"అయ్యన్న గొంతు నొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని టీడీపీ నాయకులూ వైసీపీ పార్టీ మీద ధ్వజమెత్తారు. జనం తరపున మాట్లాడటమే అయ్యన్న చేసిన తప్పా? బీసీలుగా పుట్టడమే నేరమా? అని ప్రశ్నించారు. కరెంట్ నిలిపివేసి తెల్లవారు జామున కూల్చివేతకు దిగారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇళ్లు కూల్చివేస్తే మేం ఎక్కడ ఉండాలి? రాజకీయాలు ఉంటే నేరుగా చూసుకోవాలే కానీ ఆస్తులు ధ్వంసం చెయ్యడం ఏమిటి? అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతి మాట్లాడుతూ.... మూడు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మమ్మల్ని వేధింపులుకు గురిచేస్తోంది. రాష్ట్రంలో కక్ష్య రాజకీయాలతో చంపుతున్నారు, మమ్మల్నీ చంపండి. మాకు జీవించే హక్కు లేదా?"అని ఆవేదన వ్యక్తపరిచారు.