వైసీపీ ప్రభుత్వంలో ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి కంటే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలే రాజ్యమేలే అని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి విమర్శించారు. ఏఎస్‌పేట మండలం చౌటభీమవరం గ్రామంలో బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్రం అందించే ఉపాధి నిధులతోపాటు అనేక సంక్షేమ పథకాల నిధులను జగన్ పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు పలికే గెలిపించాలని కోరారు