మచిలీపట్నంలోని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గత నాలుగు రోజుల క్రితం తెలుగు యువత అధ్యక్షుడు అయ్యప్పపై వైసీపీకి చెందిన కొంత మంది యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు పట్టించుకోకపోవటంతో కొల్లు రవీంద్ర ఈ రోజు ఇనగుదురు పోలీస్ స్టేషన్ ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రవీంద్ర ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరికొద్దిసేపట్లో రవీంద్రను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది.