గరుగుబిల్లి మండలంలోని రావుపల్లిలో ఈ రోజు ఆదివారం ఉచిత నేత్ర వైద్యశిబిరాన్ని నిర్వహించనున్నట్టు ఆశయ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం, శంకర్ ఫౌండేషన్ కంటి ఆస్పత్రి సంయుక్తంగా నిర్వహించే శిబిరాన్ని కంటి సమస్యలతో బాధపడుతున్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవసరమైన వారికి విశాఖలోని శంకర్ ఫౌండేషన్ ఆస్పత్రిలో నేత్ర శస్త్రచికిత్సలు చేస్తారన్నారు. శిబిరానికి వచ్చిన వారు ఆరోగ్యశ్రీ, ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9966118941 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.