రక్త దానం చేసే రోజున ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయాలి. తగినంత నీరు తాగితే రక్తం పరిమాణం బాగుంటుంది. రక్తదానం చేశాక 15-20 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. రక్తపోటు చెక్ చేశాక ఇంటికి వెళ్లొచ్చు. ఆ పూట రెస్ట్ తీసుకోవాలి. ఇంట్లోనే ఉండాలి. తగినంత నీరు తాగాలి. మంచి ఆహారం తినాలి. తర్వాత రోజు నుంచి యథావిధిగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. రక్తదానంతో మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాలేవీ ఉండవు.