దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య పెరుగుతోంది. అయితే నిన్నటితో పాల్చితే మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాలు కొంచెం ఊరట కలిగించాయి.దేశంలో గడిచిన 24గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలతో పోలిస్తే.. 22.4 శాతం తక్కువ. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,33,19,396కి చేరింది.ఇదిలా ఉంటే గడిచిన 24గంటల్లో దేశంలో 17 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ మరణించారు. తాజా మరణాలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,24,890 కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 2,613 నమోదు కాగా, దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 79,313కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ తో చికిత్స పొందుతూ.. 7,293 మంది కోలుకున్నారు, దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య 4,27,15,193కి చేరుకుంది. రికవరీ రేటు 98.61 శాతంగా ఉంది.ఇదిలాఉంటే గడిచిన 24గంటల్లో అత్యధికంగా కేరళలో కొత్తగా 2,786 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2,354 కేసులు, ఢిల్లీలో 1,060 కేసులు, తమిళనాడులో 686 కేసులు, హర్యానాలో 684 కేసులు నమోయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాలలో 76.28 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 28.08శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు కొవిడ్ వ్యాప్తిని నివారించేందుకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 13,00,024 డోస్‌లను వైద్య సిబ్బంది అందించారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అందించిన డోసుల సంఖ్య 1,96,32,43,003 కు చేరింది.