శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కరివేన గ్రామంలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పేరు పేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ మూడేళ్లలో చేసిన మంచిని వివరిస్తూ..మరోసారి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించాలని మనసారా కోరుతున్నారు. ఎమ్మెల్యే వెంట వైయస్ఆర్‌సీపీ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నాయకులు, అధికారుల రాకతో గ్రామమంతా కోలాహలంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa