భార్యను వేధించడంతో పాటు హతాయత్నానికి పాల్పడిన వ్యక్తికి జిల్లా కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు 1000 జరిమానాను విధించింది. శంషాబాద్ పట్టణంలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసాద్ ప్రతిరోజూ మద్యం సేవించి భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. గతేడాది హత్య చేసేందుకు కుట్ర చేయడంతో ఆమె భర్తపై ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న లోని జిల్లా పోలీసులు హత్యాయత్నం కేసును నిరూపించడంతో ఎల్బీనగర్ లోని రంగా రెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు.