మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో అసెంబ్లీ రద్దు అయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిని బలపరుస్తూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం వ్యాఖ్యానించారు. కాసేపటిలో క్యాబినెట్ భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణకు సీఎం ఉద్ధవ్ థాకరే సిద్ధం అవనున్నారు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. శివసేనకు చెందిన మంత్రి ఏక్‌నాథ్ షిండే 33 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగురవేయడంతో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడింది.