నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను అధికారానికి దూరం చేసే ఉద్దేశంతో కొందరు పన్నుతున్న కుట్రలని యోగా గురువు రామ్ దేవ్ బాబా ఆరోపించారు. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలకు ఎలాంటి అర్థం లేదని ఆయన విమర్శించారు. అవి ప్రధాని ఢిల్లీ యూనివర్సిటీలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘ఒకవేళ ఆందోళనకారులు యోగా చేసి ఉంటే.. వాళ్లు ఇలాంటి కుట్రపూరిత ఆందోళనలకు పాల్పడి ఉండేవారు కాదు. ఆందోళనకారులంతా యోగా చేయాలి. అగ్నిపథ్ కు వ్యతిరేక నిరసనలన్నీ అర్థరహితం. దేశంలో అరాచకం సృష్టించి ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అధికారానికి దూరం చేయాలనే ఎజెండాతో కొన్ని శక్తులు ఈ ఆందోళనలకు పాల్పడుతున్నాయి..” అని రామ్ దేవ్ బాబా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో యోగా ఉండవచ్చని.. కానీ యోగాలో రాజకీయం ఉండకూడదని పేర్కొన్నారు.