తమ నేత రాహుల్ గాందీని ఈడీ విచారించడం కచ్చితంగా రాజకీయ ప్రేరేపిత చర్య అని కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ విమర్శించారు. ప్రతీకార చర్యల కోసం ఇన్ కమ్ టాక్స్, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను వాడుకుంటున్నారని సచిన్ పైలెట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి ఈ సంస్థలు చేతి పనిముట్లు వంటివన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొన్నిరోజులుగా నిత్యం ఈడీ ఆఫీసులో విచారణను ఎదుర్కొంటుండడంపై ఆయన స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నందుకే కాంగ్రెస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. సోనియా, రాహుల్ లను మాత్రమేకాదు... యావత్ కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని వివరించారు.