సీఎం జగన్ తిరుపతి జిల్లాలో పర్యటన ఈ రోజు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన నాయకులని నిర్బందించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జి వినూత కోట మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ శ్రీకాళహస్తి నియోజకవర్గంకి వస్తున్నందున మాకు పోలీసులు నోటీసులు ఇవ్వటం అప్రజాస్వామికం. మా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు.బయట వెళ్లనివ్వకుండ అడ్డుకుంటున్నారు. నియోజకవర్గంలోని సమస్యలు గురించి వినతి ఇవ్వడానికి వెళ్ళలనుకున్న మమ్మల్ని,జనసైనికులను పోలీసులు అడ్డుకోవడం హేయమైన చర్య. ఇదేనా ప్రజాస్వామ్యం. జనసేన పార్టీ అంటే జగన్ రెడ్డి ఎందుకు ఇంత భయపడుతున్నారు.కే వలం వినతి పత్రానికే భయపడిపోతే ఎలా జగన్ రెడ్డి గారు! అని ప్రశ్నించారు.