మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ధనబలం, కేంద్ర ఏజన్సీలతో కూల్చేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ఆరోపించారు.హవాలా డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆమె ఆరోపించారు. మహారాష్ట్రలో జరుగుతున్నది నిజంగా దిగ్భ్రాంతికరమని ఆమె పేర్కొన్నారు.రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి సంఖ్యాబలం లేదని, అందుకే వారు హవాలా డబ్బును ఉపయోగించి అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.