పుదీనాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.. ఔషద గుణాలతో కూడిన పుదీనాతో ఎన్నో శ్వాసకోశ సమస్యలు, గొంతు సంబంధిత సమస్యలు చిటికెలో మాయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏడాది పొడవునా, నిరంతరాయంగా పుదీనా విరివిగా లభిస్తుంది.పుదీనాలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, సీ, డీ, బీ కాంప్లెక్స్ విటమిన్లు పుదీనాలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మ సంరక్షణకు ఎంతో దోహద పడతాయి. మాంగనీస్, పొటాషియం, ఐరన్ వంటివి అధిక మొత్తంలో లభిస్తాయి. శరీరంలో రక్తం పెరుగుతుంది. మెదుడు పనితీరు మెరుగై, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఆహారం జీర్ణం త్వరగా అవుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ ప్రక్రియ బాగా మెరుగుపడుతుంది.