శ్రీలంకలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద రోజుల తరబడి వెయిట్ చేస్తూ ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలోని పశ్చిమ రాష్ట్రంలో పెట్రోల్ కోసం లైన్లలో వెయిట్ చేస్తూ ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. తాజాగా అంగురువటోటలో 63 ఏళ్ల ట్రక్ డ్రైవర్ పెట్రోల్ కోసం లైన్ ఉంటూ తన వాహనంలోనే చనిపోయాడు. అతను క్యూ లైన్ లో 5 రోజులుగా ఉన్నాడని స్థానిక మీడియా తెలిపింది.