జొన్నలతో చేసిన వంటకాలు తింటే బరువును అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జొన్నలు తినొచ్చు. జొన్నల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. జొన్నలు ఎముకల ఆరోగ్యానికి, రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడతాయి. మలబద్ధకం సమస్య, గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జొన్నలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.