ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కొత్త తోటల్లో టమోటా కాయలు పనికి రాకుండా పోతుండడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పుంగనూరు మార్కెట్లో 15 కిలోల టమోటా బాక్స్ రూ. 380కి చేరుకుంది. గురువారం15 కిలోల బాక్స్ రూ. 460 పలికింది. అయితే ఒక్క రోజులోనే రూ. 80 తేడాతో కొనుగోళ్లు జరిగాయి. వర్షాలతో కాయల్లో నాణ్యత లోపించింది. దీనికి తోడు ఊజీ ఈగల దాడులతో పండ్లు పనికి రాకుండా పోతున్నాయి. మార్కెట్లో ధరలు సైతం వెనుకడుగు వేస్తున్నాయి.