సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో కొనసాగుతున్న ఈ భేటీకి మంత్రిమండలి సభ్యులంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. దీనిలో భాగంగా మూడో విడత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే విధంగా జూలైలో అమలు చేయనున్న జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం వంటి పథకాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే విధంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఏర్పాటుకానున్న అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది అదే విధంగా జెడ్పీ పాలకవర్గాలను పాత జిల్లాల ప్రకారమే కొనసాగించే అంశంపై చర్చించనున్నారు. పదవీకాలం ముగిసేవరకు 13 జెడ్పీ చైర్మన్‌లను యధాతథంగా కొనసాగేలా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు సమాచారం.. దేవాలయాల కౌలు భూముల పరిరక్షణ చర్చలపై కేబినెట్ చర్చించనుంది.