ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశంలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చర్చించి ఆమోదిస్తారని తెలిపాయి. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకంపైనా చర్చించనున్నట్లు సమాచారం.