రాష్ట్రంలో క్రొత్తగా ఖాళీగా ఉన్న రాజ్యసభ ఎంపీ సీట్లు నాలుగు అధికార పార్టీ వైసీపీ కి దక్కటం , అందులో జగన్ కి నచ్చిన మెచైనా వ్యక్తులని ఎంపిక చెయ్యడం అందరికి తెలిసిందే. వారి నామినేషన్ ప్రక్రియ ముగిసి వారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఈ రోజు రాజ్యసభ సభ్యులుగా వైయస్ఆర్సీపీ నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీలుగా ఆర్.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలను పార్టీ నేతలు అభినందించారు.