పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలంలోని యక్కలవారిపాలెంలో ప్రజా చైతన్య యాత్రలోని భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ప్రజలకు వివరించే ప్రయత్నం చేసారు స్థానిక నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంకా ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు. మైనారిటీలను,దళితులను దగా చేస్తున్నారు. ముస్లింల పథకాలకు ఎసరు పెట్టారు. పెళ్లి ఖర్చు కుటుంబం పై పడరాదని నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు అనేక పథకాలు అమలు చేశారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా రెట్టింపు సహాయం చేస్తానన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విస్మరించారు అని తెలియజేసారు.