శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల వర్గంలో సైతం చీలిక వస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. షిండే నేతృత్వంలోని చీలిక వర్గం పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న ఆలోచనే ఈ చీలికకు కారణమైందని తెలుస్తోంది.ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో సుమారు 20 మంది తిరిగి వెనక్కి వస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ 20 మంది మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో మాట్లాడుతున్నారని సమాచారం. తిరుగుబాటు ఎమ్మెల్యేలలో కొందరు బీజేపీలో విలీనానికి వ్యతిరేకంగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది.