విశాఖ స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణ ఉద్యమం 500వ రోజుకు చేరిన సందర్భంగా అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఈ రోజు మచిలీపట్నం నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు సీపీఎం పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం తెలిపారు. ఉదయం 11గంటలకు రేవతి సెంటర్ నుండి కోనేరుసెంటరు వరకు ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిథులు పాల్గొంటారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa