ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము స్వగ్రామం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం లేదని జాతీయస్థాయిలో వార్తలు రావడంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఆ గ్రామానికి కరెంటు వసతి కల్పిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో చేరుకొని శరవేగంగా పనులు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా చీకట్లోనే మగ్గుతున్న గ్రామానికి ఇన్నాళ్ళకి మోక్షం లభించిందని స్థానీకులు హర్షం వ్యక్తంచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa